ప్రతి ఏడాది ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం నిర్వహించి అందులో బెస్ట్ ఇండియన్ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే కదా. ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక ఈ ప్రదర్శనకు ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాలు ఎంపిక అయిన సంగతి కూడా విదితమే. గోవాలో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవారు నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది. ఇక అఖండ మూవీ రేపు అంటే ఈ నెల 24వ తేదీన స్క్రీనింగ్ కానుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలియచేయనున్నారు. ఈ 53వ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ పనోరమా 2022 విభాగంలో అఖండ సినిమా ప్రదర్శించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమాఅఖండ. ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాతో అటు బాలకృష్ణ-బోయపాటి కూడా హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్‌సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇక ఈసినిమా కూడా ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.