ధనుష్ సార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

first song released from dhanushs sir movie, dhanushs sir movie, Mastaaru Mastaaru Song Out Now, Mastaaru Mastaaru Song, SIR Telugu Movie Songs, SIR Movie Songs, Dhanush, Samyuktha Menon, Sai Kumar, Venky Atluri, Dhanush Latest Movie, Dhanush's Upcoming Movie, SIR, SIR 2022, SIR Movie, SIR Update, SIR New Update, SIR Latest Update, SIR Movie Updates, SIR Telugu Movie, SIR Telugu Movie Latest News, SIR Telugu Movie Live Updates, SIR Telugu Movie New Update, SIR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఈరోజు విడుదల చేశారు. మాస్టారు మాస్టారు, నా మనసును గెలిచారు అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈపాటను చిత్రీకరించారు. ఇక ఈపాటకు తమిళంలో ధనుష్, తెలుగు లో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రెండు భాషల్లో ఈ పాటను శ్వేతా మోహన్‌ పాడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 9 =