
ట్యాగ్ · 2 కథనాలు


హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

50 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న హనుమాన్ మూవీ టీజర్
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హనుమాన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా 'హనుమాన్' ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు…