150 కోట్లకు చేరువలో గాడ్ ఫాదర్మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈఏడాది ప్రథమార్థంలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈసినిమా విజయం అందించలేకపోయింది. అయితే ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాకపోవడం.. అందులోనూ గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో ఎలా ఉంటుందా అన్న టెన్షన్ పడ్డారు ఫ్యాన్స్. కానీ ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయిన వారం రోజులయితే కలెక్షన్స్ పైఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రిలీజ్ చేసిన మూడు నాలుగు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే ఈ సినిమా 145.24 కోట్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: