మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అష్టా చమ్మా మూవీ తో టాలీవుడ్ కు నాని హీరోగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో నాని తెలంగాణ పల్లెటూరి యువకుడిగా దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో దసరా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంతోష్ నారాయణన్ స్వరకల్పన లో కాసర్ల శ్యామ్ రచన , రాహుల్ సిప్లిగంజ్ , గొట్టే కనకవ్వ గానం చేసిన దసరా మూవీ ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 7. 5 మిలియన్ వ్యూస్ పైగా సాధించి నెం 1 గా ట్రెండింగ్ లో ఉంది .
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























