పోల్ గేమ్ : సీనియర్ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ ల బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ ?

Godfather or Akhanda? Which is the Best Comeback Movie?, Which is the Best Comeback Movie, Godfather or Akhanda, Akhanda, Nandamuri Balakrishna, Pragya Jaiswal, Boyapati Srinu, Chiranjeevi, Salman Khan, Nayanthara, Mohan Raja, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Godfather, Godfather Telugu movie, Godfather New Update, Godfather Telugu Movie New Update, Godfather Movie, Godfather Latest Update, Godfather Movie Updates, Godfather Telugu Movie Live Updates, Godfather Telugu Movie Latest News, Godfather Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

గాడ్ ఫాదర్ : ఆచార్య మూవీ తరువాత మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన కమ్ బ్యాక్ మూవీ గాడ్ ఫాదర్ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ , ఓవర్సీస్ లలో ఈ మూవీ కి అద్భుత స్పందన లభిస్తుంది. గాడ్ ఫాదర్ మూవీ 4 రోజులలో 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో ఈ మూవీ వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.మెగా స్టార్ చిరంజీవి తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని , ప్రేక్షక , అభిమానులతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా #MEGA 154 , భోళా శంకర్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

అఖండ : రూలర్ మూవీ తరువాత నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా కమ్ బ్యాక్ గా తెరకెక్కిన అఖండ మూవీ అఖండ విజయం సాధించి, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు సాధించింది. 103 థియేటర్స్ లో అర్ధ శతదినోత్సవం జరుపుకుంది.హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అఖండ మూవీ అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీ గా నిలిచింది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 94 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది. హీరో బాలకృష్ణ ప్రస్తుతం #NBK107 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

పోల్ గేమ్ : సీనియర్ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ ల బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − six =