గాడ్ ఫాదర్ లో బ్రహ్మన్న పాత్రలో చిరంజీవి

Chiranjeevi role in God Father Movie, God Father Movie, God Father Telugu Movie, Chiranjeevi role, Mega Star Chiranjeevi, Chiranjeevi, God Father Movie Latest Update, God Father Telugu Movie New Update, Nayanthara, Salman Khan, Satyadev Kancharana, Mohan Raja, Chiranjeevi And Nayanthara's God Father Movie, Chiranjeevi And Nayanthara's Starrer God Father Telugu Movie, God Father Movie Latest News And Update, God Father, God Father 2022, Mega Star Chiranjeevi role in God Father Movie, Chiranjeevi Latest Movies, Chiranjeevi Upcoming Movies, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

బ్రహ్మన్న పేరు వినగానే కృష్ణంరాజు నటించిన బొబ్బిలి బ్రహ్మన్న మూవీ జ్ఞాపకం వస్తుందన్న విషయం తెలిసిందే. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కృష్ణంరాజు ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన బొబ్బిలి బ్రహ్మన్న మూవీ 1984 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్రహ్మన్న అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కృష్ణంరాజు బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పటివరకూ ఏ నటుడూ కృష్ణంరాజు నటించిన బ్రహ్మన్న పాత్ర వంటి పాత్రను పోషించలేదు. 38 సంవత్సరాల తరువాత బ్రహ్మన్న వంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ను మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ లో అదే పేరుతో నటిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మెగా స్టార్ చిరంజీవి , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లపై స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన సాంగ్ ఈ మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =