అహింస ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ahimsa movie first glimpse is out, First glimpse of Ahimsa, Abhiram Daggubati’s Ahimsa, ahimsa movie first glimpse, ahimsa first glimpse is out Now, Abhiram Daggubati and Director Teja's Ahimsa, Ahimsa Movie, Abhiram's Ahimsa Movie, Ahimsa Movie Update, Ahimsa Telugu Movie Latest Update, Ahimsa, Ahimsa Telugu Movie, Abhiram's Ahimsa, Abhiram Daggubati, Ahimsa First Glimpse, Director Teja, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Abhiram Daggubati's Ahimsa Movie First Glimpse, First Glimpse,

ఇండస్ట్రీకి కొత్తవాళ్లను పరిచయం చేయడం డైరెక్టర్ తేజకు అలవాటే. ఇక ఇప్పుడు మరో కొత్త నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. అతను ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రాబోతున్న నటుడు. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు.. అభిరామ్ తో తేజ సినిమా చేస్తున్నాడు. అహింస అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇటీవ‌లే మేక‌ర్స్ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉన్న ఈసినిమాను ఎప్పుడో త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇక‌ ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ ప్రీ లుక్ పోస్ట‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ గ్లింప్స్ లో తేజ మార్క్ కనిపిస్తుంది. ఇందులో హీరోను ఓ అడవిలో కొందరు ముసుగు తో తీసుకెళ్తుండగా అతను పారిపోడానికి ప్రయత్నించడం దాంతో వాళ్ళు మళ్ళీ లాక్కొచ్చి కొట్టడం చూపించారు. ఇక ఈ వీడియోలో కాస్త వైలెన్స్ ను చూపించడంతో తేజ మార్క్ కనిపిస్తుంది. మరి ఫస్ట్ గ్లింప్స్ అయితే సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుంది చూడాలి.

కాగా ఈసినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే రజత్ బేడీ, సదా, రవి కాలే అలాగే కమల్ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + nineteen =