రేపే బ్రహ్మాస్త్ర నుండి డ్యాన్స్ కా బూత్ సాంగ్ రిలీజ్

Dance Ka Bhoot Song From Brahmastra To Be Out Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest Movies,Tollywood Movie Updates,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Pan India Movie,Brahmastra Movie Updates,Brahmastra Movie Songs,Brahmastra Dance Ka Bhoot Song Out Tomorrow,Brahmastra Dance Ka Bhoot Song Release Tommorrow,Dance Ka Bhoot Song From Brahmastra Movie,Brahmastra Pan India Movie,Brahmastra latest Updates,Latest Updates From Brahmastra Movie Team,Brahmastra Movie Team About a Song Release Dance ka Bhoot,Brahmastra Releasing in September

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్ర‌హ్మాస్త్ర కూడా ఒకటి. పురాణ అస్త్రాల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు అయాన్ ఈసినిమాను. ఈసినిమా విజన్ ఏంటో, ఈసినిమా తీయడానికి తనకు స్పూర్తినిచ్చిన విషయాలు ఏంటో కూడా ఇప్పటికే పలు వీడియోల ద్వారా తెలియచేశాడు అయాన్. ఇక ఎప్పుడో పదేళ్ల క్రితం బీజం పడిన ఈసినిమా ఎట్టకేలకు సినిమాగా రూపాంతరం చెందింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర.. శివ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది టీం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా విజువల్ వండర్ గా ఉన్న వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే కుంకుమలా అనే పాటను రిలీజ్ చేశారు. ఇంకా దేవ దేవ అనే పాటను రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. డ్యాన్స్ కా బూత్ అనే పాటను ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేయగా..ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. రణబీర్ క్యారెక్టర్ ను పరిచయం చేసే పాట అని ఇప్పటికే ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు మంచి డ్యాన్స్ నెంబర్ అని కూడా తెలుస్తుంది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ జంటగా నటించారు. రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 14 =