‘తలైవా 169’ మూవీ టైటిల్ రిలీజ్..!

Rajnikanth New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajnikanth,Super Star Rajnikanth,Rajnikanth Movie,Rajnikanth Upcoming Movie,Rajnikanth New Movie Title Released,Rajnikanth Movie Updates,Rajnikanth Latest Movie Updates, #Thalaivar169 Movie Tilted Revealed,#Thalaivar169 Movie Updates,#Thalaivar169 Movie Title,Superstar Rajnikanth #Thalaivar169 Movie,Jailer,Jailer Movie,Jailer Movie Updates, Rajinikanth Jailer Movie Updates,Rajnikanth New Movie Titled Jailer Revealed,Rajnikanth upcoming Movie Jailer Latest Updates

సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే అన్నాత్తే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ కాంత్ ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో సినిమాకు సిద్దమవుతున్నాడు. విజయ్ తో బీస్ట్ సినిమాను తీసి హిట్ కొట్టిన నెల్సన్ దర్శకత్వంలో రజనీ తన 169 వ సినిమాను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాపై గత కొద్దికాలంగా పలు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు జైలర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్టర్ లో ఒక చైన్ కి కట్టి వేసిన ఒక పొడవాటి కత్తి , దానిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని తెలుస్తోంది.

కాగా రోబో సినిమాలో రజనీకి జోడీగా నటించిన ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈసినిమాలో ర‌మ్య కృష్ణ‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, శివ‌రాజ్‌కుమార్ వంటి అగ్ర తార‌లు న‌టించ‌నున్న‌ట్లు టాక్. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 4 =