
ట్యాగ్ · 3 కథనాలు


'మేజర్' ట్రైలర్ అనౌన్స్ మెంట్ కు డేట్ ఫిక్స్..!

'మేజర్' నాకు సినిమా కాదు..ఒక ఎమోషన్ ..!
వర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో ''ఇండియా లవ్స్ మేజర్ ' ప్రెస్ మీట్…

'మేజర్'.. 'ఓ ఇషా' వీడియో సాంగ్ రిలీజ్..!
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వర్సటైల్ హీరో ఎవరంటే అడివి శేష్ పేరు చెప్పొచ్చు. తను మొదటి నుండి చేస్తున్న సినిమాలను బట్టి చెప్పొచ్చు విభిన్న పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

'మేజర్' ట్రైలర్ అనౌన్స్ మెంట్ కు డేట్ ఫిక్స్..!
సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అడివి శేష్ నటిస్తున్న మేజర్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తుండటం..దానికితోడు అడివి శేష్ ఎప్పుడూ డిఫరెంట్ కథలతో వస్తుంటాడు కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్సే వచ్చింది. టీజర్ లోని విజువల్స్, డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.