మార్వెల్ స్టైల్ లో ప్రశాంత్ నీల్ సినిమాలు..!

Producer Kiragandur About Prashanth Neel Movies,Prashanth Neel To Create Marvel Kind Of Universe With KGF3 And Salaar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prashanth Neel,Director Prashanth Neel,Prashanth Neel Upcoming Movies,Prashanth Neel New Movie Updates,Prashanth Neel Salaar Movie Updates,Prashanth Neel KGF3 and Salaar movie latest Updates, Prashanth Neel Salaar Movie,Prashanth Neel and Prabhas Salaar Movie Latest Updates,Prashanth Neel To create Marvel Kind of Universe with Salaar and KGF3 Movie, Prashanth Neel’s upcoming films are Salaar, NTR31, and KGF Chapter 3

కన్నడ సినీ పరిశ్రమకు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా కె.జి.యఫ్ సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. అప్పటికే బాహుబలి సినిమాతో సౌత్ ఇండస్ట్రీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకోగా.. ఆసినిమా స్పూర్తితోనే తెరకెక్కిన కె.జి.యఫ్ సినిమా కూడా మరోసారి సౌత్ సినిమా సత్తాను చాటింది. ఇక కె.జి.యఫ్ సినిమా కన్నడ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది. కేవలం కన్నడలోనే కాదు తెలుగు, తమిళ్ లోనే కూడా మంచి హిట్ అయింది. ఇక నార్త్ లో అయితే ఏ రేంజ్ లో ఈసినిమా ప్రభంజనం సృష్టించిందో చూశాం. నార్త్ లో వంద కోట్లకు పైగా ఈసినిమా కలెక్షన్ల్ ను రాబట్టింది. ఇక ఈసినిమా విజయంతో కె.జి.యఫ్ 2 కూడా తీశారు మేకర్స్. ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కె.జి.యఫ్ తరువాత ప్రశాంత్ నీల్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. ప్రభాస్ తో సలార్, అలానే ఎన్టీఆర్ తో మరో సినిమా కూడా చేస్తున్నాడు. అంతేకాదు కె.జి.యఫ్ 3 సినిమా ఉంటుందా లేదా అన్న తరుణంలో మూడో పార్ట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు నిర్మాత విజయ్ కిరగందూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కిరగందూర్ ప్రశాంత్ నీల్ సినిమాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడని.. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి కావచ్చు. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా ఆ తరువాత కె.జి.యఫ్ 3 ఉంటుందని ఈ సినిమాలను ఒక మార్వెల్ లాంటి యూనివర్స్ ను సష్టించాలను కుంటున్నాం అంటూ తెలిపాడు. చూద్దాం మరి సలార్ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 12 =