రౌడీ హీరో సర్ ప్రైజింగ్ లాంగ్ వాక్..!

Vijay Deverakonda Lost in the Beauty on Nature,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda movie Updates,Vijay Deverakonda latest movie updates,Vijay Deverakonda Lost in the nature,Vijay Deverakonda Liger movie Updates,Vijay Deverakonda Enjoying nature,Vijay Deverakonda Lost in Beautiful nature,puri jagannadh lIger movie Updates,puri jagannadh and Vijay Deverakonda Movie Updates,puri jagannadh and Vijay Deverakonda liger movie updates

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. కరోనా వల్ల ఈసినిమాకు చాలా బ్రేకులు పడ్డాయి. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్‌ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా పూరీతో రెండో సినిమా జనగణమన కు సిద్దమవుతున్నాడు విజయ్. ఈసినిమా కోసం తన మేకోవర్ ను సైతం మార్చేశాడు. ప్రస్తుతం అయితే కాస్త రిలాక్స్ అవుతున్నాడు. దొరికిన కాస్త ఖాళీ టైమ్ లో రీఫ్రెష్ అవుతున్నాడు రౌడీహీరో. ఈనేపథ్యంలోనే రికవరీ థెరపీ అంటూ.. రిలాక్స్ అంటూ ఈమధ్య సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు. ఇక తాజాగా కంప్లీట్ ఫ్రెష్ లుక్‌లో క‌నిపిస్తున్న విజ‌య్ స‌ర‌దాగా చ‌ల్ల‌గాలిని ఆస్వాదించేందుకు చెట్ల మ‌ధ్య‌ నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలు పోస్ట్ చేశాడు విజయ్. ఈ వీడియోను ట్విట‌ర్ లో పోస్ట్ చేస్తూ..లాంగ్ వాక్స్ అంటూ పేర్కొన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 15 =