నిర్మాతగా మారిన ‘బంగార్రాజు’ డైరెక్టర్..!

Bangarraju Director Kalyana Krishna Turns Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyana Krishna,Director Kalyana Krishna,Bangarraju Director Kalyana Krishna,Director Kalyana Krishna Latest Super hit Movie Bangarraju,Director Kalyana Krishna turns Producer, Director Kalyana Krishna Producing A Movie Titled Lambasingi,Lambasingi Movie Produced by Director kalyana Krishna,Direcotr Turns Producer For Movie Lambasigni Movie

ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఒక పక్క తమ సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈలిస్ట్ లో బంగార్రాజు డైరెక్టర్ కూడా చేరిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కళ్యాణ్ కృష్ణ.
న‌వీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను కళ్యాణ కృష్ణ నిర్మించనున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాకు లంబ‌సింగి అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ ను చూస్తుంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.

కాగా బిగ్ బాస్ ఫేం దివి వైద్య ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ధ్రువ‌న్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని అంద‌మైన గ్రామాల్లో లంబ‌సింగి ఒక‌టి. ఇదే టైటిల్‌ను సినిమాకు ఫిక్స్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు మేక‌ర్స్. వేస‌వి కాలం, చ‌లికాలంలో అత్యంత ఎక్కువ‌మంది పర్యటించే ప్ర‌దేశం లంబ‌సింగి. మరి ఈసినిమాతో నిర్మాతగా మారుతున్న కళ్యాణ్ కృష్ణకు ఈసినిమాకు ఎంత వరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 16 =