బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో ‘విక్రమ్’ ఫస్ట్ గ్లింప్స్..!

Vikram first glimpse with beast And KGF movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Hero Vikram,Vikram First Glimpse,Vikram first Glimpse with Beast and KGF,Kamal Haasan Vikram movie First Glimpse,First Glimpse of Vikram movie Released, Hero Kamal Haasan,Kamal Haasan Upcoming Movie Vikram,Kamal Haasan Latest Movie Updates,Vikram Movie First Glimpse Updates,Vikaram Latest updates,Vikram kamal Haasan upcoming movie

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్‌ మూవీలో కమల్‌ హాసన్‌ పూర్తిగా యాక్షన్‌ రోల్‌ పోషించనున్నారు. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. బీస్ట్, కె.జి.యఫ్ సినిమాలు రిలీజ్ అయ్యే థియేటర్లలో ఈ సినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eleven =