కిన్నెర మొగిలయ్య కు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్..!

#CMKCR,CM KCR,CM KCR Announces 1 Crore For Kinnera Mogulaiah,CM KCR Announces 1 Crore Rupees To Kinnera Mogulaiah,CM KCR Announces House Site And Rs 1 Crore To Darshanam Mogulaiah,CM KCR Announces One Crore To Kinnera Mogulaiah, CM KCR Announces Rs 1 Crore And Plot For Kinnera Mogulaiah,CM KCR Announces Rs One Crore To Kinnera Mogulaiah,CM KCR Gift To Padma Shri Mogulaiah,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR Live,CM KCR Live News,CM KCR Live Today, CM KCR Live Updates,CM KCR News,CM KCR Rs 1 Crore To Darshanam Mogulaiah,cm kcr speech,KCR Announces 1 Crore Rupees To Kinnera Mogulaiah,KCR Gives 1 Crore To Padma Sri Awardee Mogulaiah,Kinnera,Kinnera Artist,Kinnera Artist Mogulaiah, Kinnera Mogulaiah,Kinnera Mogulaiah 1 Crore Rupees,Kinnera Mogulaiah Latest News,Kinnera Mogulaiah News,Kinnera Mogulaiah Padma Shri Award,latest telugu movies news,latest tollywood updates,Mogulaiah,Padma Shri,Padma Shri Award, Padma Shri Darshanam Mogulaiah,padmashri,telangana,Telangana Chief Minister KCR,Telangana Chief Minister KCR Announces 1 Crore Rupees To Kinnera Mogulaiah,Telangana CM,Telangana CM KCR, Telangana CM KCR Announced House Land And Rs 1 Crore For Padma Sri Mogulaiah,Telangana CM KCR Announces 1 Crore For Kinnera Mogulaiah,Telangana CM KCR Announces One Crore To Mogulaiah,Telangana Govt,telangana news,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Movie Updates

దర్శనం మొగిలయ్య అలియాస్ కిన్నెర మొగిలయ్య.. ఈ పేరు గత కొద్దికాలంగా ఎవరికీ తెలీదు.. కానీ ఎప్పుడైతే భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడాడో అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. భీమ్లానాయక్ లో తను పాడిన పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో కూడా చూశాం. ఆడా లేడు మియా సాబ్.. ఈడా లేడు మియా సాబ్ అని మొగిలయ్య పాడే పాటను ఈసినిమాకోసం కాస్త లిరిక్స్ మార్చారు. అయితే ఈపాటలో ఉన్న సహజత్వం పోకుండా ఉండాలని తన చేతే పాడించారు భీమ్లానాయక్ మేకర్స్. ఇక మొగిలయ్య ఆపాట పాడకుండా ఉంటే అంత క్రేజ్ వచ్చేది కాదేమో. తన గొంతే పాటకు ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట పాపులర్ అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా మొగిలయ్యని అభినందించారు. ఆర్థిక సాయం కూడా చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మొగిలయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. ఇక తాజాగా సీఎం కేసీఆర్ కూడా మొగిలయ్యకు రివార్డును ప్రకటించారు. కోటిరూపాయలతో పాటు హైద్రాబాద్ లో ఇంటి స్థలం.. ఇంటి నిర్మాణం ఖర్చు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో తమ అధికారిక ట్విట్టర్ ద్వారా కూడా ఈవిషయాన్ని తెలియచేశారు. మొత్తానికి ఇన్నేళ్లకు మొగిలయ్య జీవితంలో మంచి రోజులు వచ్చాయి.

ఇక ఇదిలా ఉండగా ఆపాటతో మొగిలయ్య తో పాటు తనకు జీవనాధారం అయిన కిన్నెర కళ గురించి కూడా అందరికీ తెలిసింది. మొగిలయ్య స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. 12 మెట్ల కిన్నెరను వాయించడంలో సిద్దహస్తుడు మొగిలయ్య. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు. అది వాయిస్తూనే పొట్ట నింపుకుంటున్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఈ సంప్రదాయ వాద్యాన్ని వాయించేది మొగిలయ్య ఒక్కరేనని.. తనకు వచ్చిన కళను అందరికీ తెలియాలని ఎప్పటినుండో తాపత్రయ పడుతున్నానని మొగిలయ్య చెబుతున్నాడు. ఇన్నాళ్లకు తను అనుకున్నది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =