ఆచార్య : కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గాడ్ ఫాదర్ : కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
భోళా శంకర్ : ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.
చిరు 154 మూవీ: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్ టైనర్ చిరంజీవి 154 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జాలరి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
[totalpoll id=”72774″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: