‘రాధేశ్యామ్’.. ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్

Pan India Star Prabhas Most Awaited Movie Radhe Shyam Vikramaditya Movie Teaser Is Out Now,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers 2021,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Updates,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest Update,Radha Krishna Kumar,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Movie Update,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Telugu Movie Teaser,Prabhas Radhe Shyam Teaser,Prabhas Radhe Shyam Movie Teaser,Prabhas New Movie Teaser,Vikramaditya,Radhe Shyam Vikramaditya Teaser,Prabhas's Birthday,Radhe Shyam Teaser Update,Happy Birthday Prabhas,HBD Prabhas,Radhe Shyam Teaser,Justin Prabhakaran,UV Creations,Radhe Shyam Official Teaser,Radhe Shyam Songs,Radhe Shyam Trailer,Prabhas Latest Movie Teaser,Global Prabhas Day,Introducing Prabhas As Vikramaditya,Radheshyam Teaser,Radhe Shyam Introducing Prabhas As Vikramaditya,Introducing Prabhas As Vikramaditya In Radhe Shyam Movie Teaser,Prabhas Introduction Video,Prabhas As Vikramaditya,Prabhas As Vikramaditya Teaser,Radhe Shyam Prabhas Character Introduction Teaser,Radhe Shyam Prabhas Introduction Teaser,Prabhas Turns 42,Radhe Shyam Prabhas Character Teaser,RadheShyam 2022,#HappyBirthdayPrabhas,#GlobalPrabhasDay,#RadheShyam,#RadheShyamTeaser

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ ను ఏ స్థాయికి పెంచుకున్నాడో తెలుసు కదా. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్‌ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాతో తన ముద్రను మరింత బలంగా వేసుకున్నాడు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తుండటంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దంగా ఉండగా సలార్, ఆది పురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ అభిమానులు ఆయన సినిమాల నుండి అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ రాధేశ్యామ్ నుండి టీజర్ వస్తుందని తెలియడంతో.. ఆ టీజర్ ఎప్పుడొస్తుందబ్బా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. అయితే ఈసినిమా టీజర్ కాదు కాని… ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. విక్రమాదిత్య గా ప్రభాస్ నటిస్తుండగా.. ఆపాత్ర ఎలా ఉంటుందో చూపించారు. టీజర్ లో లవర్‌బాయ్‌గా ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడూ విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు. కానీ చెప్పను. అన్నీ నాకు తెలుసు. కానీ చెప్పను. నేను నీ ఆలోచనకు కూడా అందను. నా పేరు విక్రమాధిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒకడిని కూడా కాదు` అంటూ సాగే టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సన్నివేశాలకు అనుగుణంగా జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన సంగీతం మనసులను హత్తుకునేలా ఉంది.

కాగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =