“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్”మూవీ కి విశ్వక్ సేన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం వహించడం విశేషం. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న విశ్వక్ సేన్ రీసెంట్ గా “పాగల్ “మూవీలో చాలా ఫ్రెష్ లుక్ లో మంచి ఎనర్జిటిక్ గా సినిమా అంతా నడిపిస్తూ కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ ని కూడా చాలా ఈజీ గా చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా రూపొందిన “గామి” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”అశోకవనంలో అర్జున కళ్యాణం” మూవీలో నటిస్తున్నారు . ఫోటో షూట్స్ లో పాల్గొని విశ్వక్ సేన్ ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ ఫొటో షూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. తాజా ఫోటో షూట్ లో విశ్వక్ సేన్ స్టైలిష్ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: