యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీలో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. “RRR”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30″మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “RRR”మూవీలో కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు పెరిగి , ఆదివాసీ బిడ్డగా కాస్త రఫ్ లుక్‌లోనే కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“#NTR30” మూవీ కై ఎన్టీఆర్ స్పెషల్ వర్కవుట్స్‌తో, సరైన డైట్ ఫాలో అయ్యి బరువును తగ్గించుకుని మళ్ళీ స్టైలిష్ లుక్‌లోకి మారబోతున్నారు. ప్రతి సినిమాలో పాత్రకి తగ్గట్టు మేకోవర్ ఛేంజ్ చేసుకునేందుకు ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్దంగా ఉంటారన్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది. “జనతా గ్యారేజ్ “మూవీ తో ప్రేక్షక , అభిమానులను అలరించిన కొరటాల శివ , ఎన్టీఆర్ మరో సారి ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: