సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక్కడ స్టార్ హీరోలను.. యంగ్ హీరోల కాంపిటీషన్ ను తట్టుకొని తమకుంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. కత్తి మీద సాము లాంటిది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు మూడు సినిమాలు తీసినా కూడా ఇన్నాళ్లకు హిట్ రుచిని తెలుసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇటీవల ఏక్ మినీ కథ అనే విభిన్న కథతో హిట్ అందుకున్నాడు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరో అయ్యాడు. ఇప్పుడు చిన్న చిన్న బ్యానర్ లలో కాదు… యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. వైజయంతీ మూవీస్ బ్యానర్లో .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంతోష్ శోభన్ సినిమాలు చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటన్నిటితో పాటుగా సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాదు ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు.. లుక్ ను రిలీజ్ చేశారు. ‘ప్రేమ్ కుమార్’ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసారి పెళ్లి అవ్వని ఫ్రస్ట్రేషన్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
Presenting you #PremKumar 🎉
A tale of love, lovers & the poor groom!@santoshshobhan is ready for the wedding! But is his fiancé ready?🔎@abhimaharshi1 #ShivaPrasadPanneeru #Rampy @cerebrahma @Garrybh88 #AnirudhKrishnamurthy pic.twitter.com/ZupDHBevmF— Sharanga Entertainments (@SharangaOffl) June 4, 2021
కాగా ఈసినిమాలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కృష్ణ చైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు తదితరులు నటిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత మిగతా భాగం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: