గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. ఇక రాజకీయాల్లో ఉన్నంత కాలం తన ఇంటర్య్వూల ద్వారా వివాదాల్లో ఉంటూనే వచ్చారు. అయితే తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి 😎 https://t.co/iE7PYq5xI2
— BANDLA GANESH. (@ganeshbandla) May 6, 2021
ఇక ఇదిలా ఉండగా ఇటీవల బండ్ల గణేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే కద. అది కూడా తమిళ్ రీమేక్. ఇటీవల తమిళంలో వచ్చిన ‘మండెల’ మూవీ విడుదలైన తర్వాత పలు వివాదాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఎంతటి స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చిందో అంతే రేంజ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళంలో వచ్చిన ఈ ‘మండెల’ మూవీలో హీరోగా తమిళ నటుడు యోగిబాబు నటించాడు. అయితే ఇప్పుడు ఈ మూవీని బండ్ల తెలుగులో రీమేక్ చేయాలని.. తెలుగు హక్కుల కోసం ఆయన కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేశారని అన్నారు. ఈనేపథ్యంలో యోగిబాబు పాత్రలో బండ్ల గణేష్ నటించనున్నాడని కూడా అన్నారు. అయితే ఈసినిమా నుండి బండ్ల తప్పుకున్నాడని.. ఆపాత్రలో సునీల్ ను సెలెక్ట్ చేశారని కథనాలు వస్తున్నాయి. దీంతో దీనిపై స్పందించిన బండ్ల గట్టి కౌంటర్ ఇచ్చారు. పలు కథనాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి అంటూ బండ్ల కౌంటర్ ఇచ్చాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: