జీతూజోసఫ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ ను లైన్ లో పెట్టారు. దానికి తోడు మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను కూడా తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో దృశ్యం-2 ఫస్ట్ షెడ్యూల్ షూట్ పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. సెకండ్ షెడ్యూల్ కోసం వెంకీ కేరళ వెళ్లాడు. దాదాపు మూడు వారాలపాటు జరగనున్న ఈ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో తమిళంలో హిట్టయిన ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఎఫ్3 షూటింగ్ కూడా చేస్తున్నాడు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: