పెళ్లి పీటలెక్కబోతున్న మెహ్రీన్..!

Mehreen Pirzada To Get Engaged Next Month,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Mehreen Pirzada,Heroine Mehreen Pirzada,Actress Mehreen Pirzada,Actress Mehreen Pirzada To Be Engaged Next Month,Mehreen Kaur Pirzada Confirms Her Engagement Next Month,Mehreen Pirzada To Get Engaged Next Month,Mehreen Kaur Pirzada Confirms Her Engagement,Mehreen Pirzada Getting Engaged To MLA's Son In Jaipur,Mehreen,Actress Mehreen Pirzada Getting Engaged,Mehreen Pirzada Getting Engaged Next Month In Jaipur,Actress Mehreen Pirzada Getting Engaged To Mla's Son In Jaipur,Bhavya Bishnoi,Mehreen Pirzada To Get Engaged,Mehreen Pirzada Engagement Ceremony,Mehreen Pirzada Engagement,Mehreen Pirzada Engagement News,Mehreen Pirzada Engagement Next Month

2020 లో ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు. అందులో రానా, కాజల్, నితిన్, నిఖిల్, నిహారిక లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ భామ కొద్దిరోజుల్లో వివాహం చేసుకుంటున్నట్టు ఒక రెండు మూడు రోజుల నుండి వార్తలు వైరల్ గా మారాయి. ఇంతకీ వరుడు ఎవరనుకుంటున్నారా ఎవరో కాదు… కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌. ఇక భవ్య బిష్ణోయ్‌ తాత భజన్ లాల్ బిష్ణోయ్ అయితే హరియాణా ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు పని చేశారు. అలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భవ్య బిష్ణోయ్ తో మెహ్రిన్ పెళ్లి నిశ్చయమైందట. వీరిద్దరి కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన మెహ్రీన్ కూడా తన పెళ్లి నిజమే అన్నట్టు కన్ఫామ్ చేసింది. అంతేకాదు వచ్చే నెలలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోబోతున్నట్టు తెలిపింది. అయితే మార్చి 12వ తేదీన వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందని…ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్‌ వేదిక కానుందని అంటున్నారు.

ఈ భామ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్‌ 3 సినిమాతో బిజీగా ఉంది. మరి పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందో లేదో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.