
ట్యాగ్ · 7 కథనాలు


"DEAR మేఘ" సెన్సార్ పూర్తి

'డియర్ మేఘ' రిలీజ్ డేట్ ఫిక్స్

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్

డియర్ మేఘ స్పెషల్ పోస్టర్ రిలీజ్

'కథ కంచికి మనం ఇంటికి' ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
చాణిక్య చిన్న దర్శకత్వంలో తిృగున్, పూజిత పొన్నాడ జంటగా వస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి సినిమా మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది.

"DEAR మేఘ" సెన్సార్ పూర్తి
వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ , సోరింగ్ ఎలిఫెంట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అరుణ్ ఆదిత్, మేఘ ఆకాష్ జంటగా తెలుగు , తమిళ భాషలలో రూపొందిన "DEAR మేఘ" మూవీ సెప్టెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. అర్జున్ సోమయాజులు ఒక కీలక పాత్రలో నటించారు. కన్నడ హిట్ "దియా "మూవీ కి రీమేక్ గా రూపొందిన "DEAR మేఘ" మూవీ కి హరి గౌర సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'డియర్ మేఘ' రిలీజ్ డేట్ ఫిక్స్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలను కొట్టిపారేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్. . సెప్టెంబర్ 3న థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
"లై "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఛల్ మోహన్ రంగ "మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ "పేట " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "శాటిలైట్ శంకర్ " మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మేఘ ప్రస్తుతం 2 తమిళ , 4 తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మేఘ కథానాయికగా రూపొందిన "డియర్ మేఘ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "డియర్ మేఘ "మూవీప్రమోషన్‌లో పాల్గొన్నమేఘ అభిమానుల ఆరాధ్య దైవం తలైవా రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'డియర్ మేఘ' టీజర్ రిలీజ్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.

డియర్ మేఘ స్పెషల్ పోస్టర్ రిలీజ్
మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'డియర్ మేఘ'. ఇటీవలే ఈ సినిమానుండి మేఘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘ ఈసారి విభిన్నమైన పాత్రతో వస్తుందని అర్థమైంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ‘డియర్ మేఘ’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మహేష్ చేతుల మీదుగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ రిలీజ్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మరో డిఫరెంట్ థ్రిల్లర్ కథతో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి `డబ్లూడబ్లూడబ్లూ` (హూ,వేర్,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే రానా చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.