
ట్యాగ్ · 2 కథనాలు


రజనీకాంత్ తరువాత ధనుష్‌తో...?

సెల్వ రాఘవన్ - ధనుష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆయిరాతిల్ ఒరువన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘యూగానికి ఒక్కడు’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సెల్వ రాఘవన్. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా రావడానికి కొంత సమయం పడుతుంది.

రజనీకాంత్ తరువాత ధనుష్‌తో...?
తన తొలి చిత్రం `పిజ్జా`తో తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులనూ అలరించాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. ఆ తరువాత రూపొందించిన `జిగర్తండా`(ఇప్పుడు ఇదే సినిమాని హరీష్ శంకర్ `వాల్మీకి`గా తెరకెక్కిస్తున్నాడు)తో దర్శకుడిగా మరో మెట్టు ఎదిగాడు. తదనంతరం `ఇరైవి`, `మెర్క్యురీ` చిత్రాలతోనూ తమిళ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన కార్తిక్... ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో `పేట`తో పలకరించాడు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రజనీ అభిమానుల మనసు దోచుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్.