
ట్యాగ్ · 7 కథనాలు


'రాధేశ్యామ్' మూవీ బెస్ట్ ఎపిసోడ్స్..!

'రాధేశ్యామ్' విజన్ ఎంటో చెప్పిన రాధాకృష్ణ
'రాధే శ్యామ్' టీజర్ అప్ డేట్ త్వరలో

'రాధే శ్యామ్' - 1000 మంది.. 100 రోజులు
రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్

'రాధేశ్యామ్' డిలీట్ సీన్ల పై 'రాధాకృష్ణ' రియాక్షన్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య ఈసినిమా మార్చి 11న రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో మంచి ప్రేమకథగా ఈసినిమా తెరకెక్కగా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించింది ఈసినిమా. ఇక చాలా రోజులు తరువాత ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ పాత్రలో కనిపించగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.

'రాధేశ్యామ్' మూవీ బెస్ట్ ఎపిసోడ్స్..!
ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాధేశ్యామ్’. 1970నాటి యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీలో ఇందులో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా హెగ్డే నటించి మెప్పించారు. మార్చి 11వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక రాధేశ్యామ్ ఓ విజువల్ వండర్ అని ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ కు తెలిసే ఉంటుంది. ఇలాంటి సినిమాల గురించి చెప్పడం కంటే స్క్రీన్ పై చూస్తేనే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. అందమైన ప్రేమకథ, దానికి చక్కని నటీనటులు, వారి నటన, అంతే అందంగా ఉండే…

'రాధేశ్యామ్' విజన్ ఎంటో చెప్పిన రాధాకృష్ణ
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హేగ్డే ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఈసినిమా మార్చి11న ప్రేక్షుకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తో పాటు ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. అందంగా రాసుకున్న రాధకృష్ణ ప్రేమకథ, దానికి తోడు విజువల్స్, ఇంకా సంగీతం ఇలా అన్నీ ఈసినిమాకు కలిసొచ్చాయి. ఇక వాటికి తోడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో నటించిన పూజా హెగ్డే నటనే ఈసినిమాకు ప్రధాన బలమైంది. వారిద్దరితో ఒక అద్భుతమైన ప్రేమకథని వెండితెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ రాకపోవడంతో ఆడియన్స్ కు కూడా ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది. సినిమా చూసిన ఆడియన్స్ కు…
'రాధే శ్యామ్' టీజర్ అప్ డేట్ త్వరలో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అభిమానులు కూడా తమ హీరో సినిమా అప్ డేట్స్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పటిలా కాదులే కానీ ఈ మధ్యకాలంలో బాగానే అప్ డేట్స్ ఇస్తున్నారు.

'రాధే శ్యామ్' - 1000 మంది.. 100 రోజులు
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది అసలే కరోనా వల్ల అనుకున్న టైం కంటే ఎక్కువ ఆలస్యం అవ్వడంతోబ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేసేపనిలో పడ్డారు. అలా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారో లేదో.. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ కూడా రాధా కృష్ణ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు.
రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చి ఒక వారం గ్యాప్ తీసుకొని అప్పుడే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టేసారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేజర్ పోర్షన్స్ పూర్తి చేసుకోగా మొత్తం షూటింగ్ ను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్
'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.