నిర్మాతగా సోనూ సూద్

Bollywood Actor Sonu Sood Turns Producer To Make Inspiring Movies

తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ సోనూ సూద్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ” అరుంధతి ” మూవీ లో సోనూ సూద్ పశుపతి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ విలన్ గా నంది , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “అతడు “, “అశోక్ “, “దూకుడు “, జులాయి “,
“సింబా “(హిందీ ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెండి తెర పై హీరోగా వెలిగిపోవాలనే కోరికతో ముంబై లో అడుగు పెట్టిన సోనూ సూద్ విలన్ పాత్రలకు పరిమితం అయ్యారు. రీల్ లైఫ్ లో హీరో కాలేకపోయినా సోనూ సూద్ , లాక్ డౌన్ సమయం లో వలస కార్మికులు , నిరు పేదలను కోట్లాది రూపాయలతో ఆదుకుని రియల్ లైఫ్ లో  హీరోగా మారారు. సోనూ సూద్ ప్రస్తుతం “ఆచార్య “, “అల్లుడు అదుర్స్ “మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ లో సోనూ సూద్ తాను నిర్మాతగా మారుతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు , తాను చేయాలనుకుంటున్న కథలకై అన్వేషిస్తున్నాననీ , త్వరలోనే నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.