హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ఈ సినిమాతో పాటు శ్రీను వైట్లతో కలిసి `ఢీ`కి సీక్వెల్ గా డి అండ్ డి – డబుల్ డోస్’ పేరుతో ఓ మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీని ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటినుండే మేకోవర్ కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా షర్ట్ విప్పి తన కూతురు ఐరాతో కలిసి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నా ఫ్రెండ్స్ నన్ను బీస్ట్ అని అనేవారు.. కానీ లిటిల్ వన్ కు నేను జెంటిల్ మెన్ బీస్ట్ ను అని పోస్ట్ వీలో తెలిపాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























