చిరుత : వైజయంతీ మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ , నేహశర్మ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “చిరుత “మూవీ ఘనవిజయం సాధించి 40 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. మొదటి చిత్ర మైనా హీరో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తండ్రి (మెగా స్టార్ చిరంజీవి ) కి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మగధీర : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ “మగధీర “ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1000 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ లో రామ్ చరణ్ , కాజల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి
స్టార్ డమ్ అందుకున్నారు.
రచ్చ : మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ , తమన్నా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “రచ్చ” మూవీ ఘనవిజయం సాధించింది. చిరంజీవి “గ్యాంగ్ లీడర్” మూవీ లోని “వానా వానా వెల్లువాయే ” రీమిక్స్ సాంగ్ లో రామ్ చరణ్ , తమన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. పంచ్ డైలాగ్స్ తో దర్శకుడు సంపత్ నంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఎవడు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ఎవడు “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలలో నటించడం విశేషం. యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ధృవ : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ధృవ “మూవీ ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. హీరో రామ్ చరణ్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో , విలన్ ల మైండ్ గేమ్ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు సురేందర్ రెడ్డి స్టయిలిష్ మేకింగ్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది.
రంగస్థలం :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ,సమంత జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించింది. చిట్టి బాబు గా రామ్ చరణ్ , రామలక్ష్మిగా సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించడం విశేషం. ఈ మూవీ కి రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
[totalpoll id=”50155″]
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: