రాజమౌళి తో వర్క్ చేయాలనుందన్న ‘మిస్ వరల్డ్’

Miss World 2017 Title Winner Manushi Chhillar Express Her Interest To Work With Tollywood Ace Director SS Rajamouli

రాజమౌళి డైరెక్షన్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. మరి అలాంటి డైరెక్టర్ తో సినిమా తీయాలని ఎవరికి ఉండదు చెప్పండి. రాజమౌళి సినిమాలో ఉండటమే ఒక అదృష్టంగా భావిస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా మిస్ యూనివర్స్ ఆ మాట చెపుతుందంటేనే రాజమౌళి టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ మిస్ యూనివర్స్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు మానుషీ చిల్లర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషీ చిల్లర్ ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతుంది. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయ్యింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న భారీ పీరియాడిక్ మూవీ పృథ్విరాజ్ చిత్రంతో ఆమె వెండితెర ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతా.. రాజమౌళి ఓ గొప్ప దర్శకుడు, ఆయన సినిమా మేకింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని…ఆయన తెరకెక్కించిన మగధీర, బాహుబలి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.. స్త్రీ పాత్రలను ఆయన మలిచే విధానం చాలా బావుంటుంది.. ఆయనతో వర్క్ చేయాలని నాకు కూడా ఉంది అని ఆమె తెలిపింది. మరి మిస్ వరల్డ్ అంత ఆఫర్ ఇచ్చిన తర్వాత రాజమౌళి ఊరుకుంటాడా. తన తర్వాత సినిమాల్లో ఆమెకు లీడ్ యాక్ట్రెస్ పాత్ర ఇస్తాడేమో చూద్దాం.

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =