ట్యాగ్ · 1 కథనాలు
సాంగ్
'శివశంకరీ' పాట ట్రోలింగ్ పై బాలయ్య రియాక్షన్
నందమూరి బాలకృష్ణ స్వభావం గురించి తెలిసిందే. పైకి గంభీరంగా కనిపించినా.. ఆయనిది మాత్రం చిన్నపిల్లల స్వభావమే అని అందరూ అంటుంటారు. అంతేకాదు తనపై వచ్చే విమర్శలను కూడా చాలా లైట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్ పై చాలా సున్నితంగా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా `జగదేకవీరుని కథ` సినిమాలోని `శివశంకరీ` పాటను బాలకృష్ణ స్వయంగా పాడి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తలెత్తాయి. ఇక ఈ విమర్శలపై స్పందించిన బాలయ్య.. తన తండ్రి తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన చెప్పారు. ఆయన నటించిన ఆ సినిమాలోని ఈ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు…