కోవిల్ ప‌ట్టిలో `నార‌ప్ప‌`

Narappa Movie Team Heads To Tamil Nadu For Movie Shooting

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`… తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అమ‌లా పాల్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని మాతృకని నిర్మించిన క‌లైపులి ఎస్. థానుతో క‌ల‌సి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ త‌మిళ‌నాడులోని కోవిల్ ప‌ట్టిలో జ‌రుగుతోంది. అక్క‌డ నెల రోజుల పాటు ఏక‌ధాటిగా ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని స‌మాచారం. అంతేకాదు… ప్ర‌స్తుతం పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని తెలిసింది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి ఈ ఏడాది వేస‌విలో సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =