పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో `రెడ్`

red-movie-team-heads-to-italy-for-song-shooting

గ‌త ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్`గా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్.. ప్ర‌స్తుతం `రెడ్`తో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం `త‌డ‌మ్` ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పెతురాజ్, అమృతా అయ్య‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తుండ‌గా.. స్ర‌వంతి మూవీస్ నిర్మిస్తోంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన పాట‌ల చిత్రీక‌ర‌ణ ఇట‌లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. అక్క‌డ రామ్, మాళ‌వికపై రెండు ప్ర‌ణ‌య గీతాల్ని చిత్రీక‌రిస్తోంది యూనిట్. ఈ నెల 12న మొద‌లైన ఈ షెడ్యూల్.. 20 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఆపై హైద‌రాబాద్ లో చిత్రీక‌రించే పాట‌తో సినిమా పూర్త‌వుతుందని స‌మాచారం. కాగా, ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న `రెడ్`.. ఏప్రిల్ 9న జ‌నం ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =