అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మధ్య విలన్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ ప్రేమకథతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. సురేష్ దర్శత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో ‘నేను లేని నా ప్రేమకథ’ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నవీన్‌చంద్రకు జోడీగా గాయత్రీ సురేష్ నటిస్తున్నారు. క్రిష్ సిద్ధిపెల్లి, అదితి మరో జంటగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే మరో ఇంటెన్స్ లవ్ స్టోరీ తో వస్తున్నట్టు తెలుస్తుంది.
Interesting First look posters of #NenuLeniNaaPremaKatha!! #HappyValentinesDay #NLNPFirstLooks@Naveenc212 @MyakalAditi @KrishSiddipalli @GayathriRS_ @Rajaraveendar
🎬 @Suresh_dir
💰#KalyanKandukuri@ThrishalaEnt @NlnpTelugu pic.twitter.com/nZaMHaSKwl— Telugu FilmNagar (@telugufilmnagar) February 14, 2020
[custom_ad]



కాగా ఫ్రెష్ లవ్‌స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాను ఎంఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కళ్యాణ్ కందుకూరి నిర్మిస్తున్నారు. జువిన్ సింగ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అంతఃపురం, ఖడ్గం చిత్రాలకు ఫొటోగ్రఫీని అందించిన ఎస్.కె.ఏ. భూపతి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























