‘బ్యాచ్‌లర్’ కథలతో మన హీరోలు..!

Telugu Film Heroes Choosing Bachelor Stories To Woo Audience

మన్మథుడు సినిమాలో నాగ్ ఎప్పుడో సింగిల్ లైఫ్ బెటర్ అని బ్యాచ్‌లర్ లైఫ్ గొప్పతనాన్ని చెప్పాడు. ఇక ఇప్పుడు మన యంగ్ హీరోలు కూడా సోలో లైఫ్ ఏ బెటరని అంటున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టిల్ బ్యాచిలర్ గానే వున్నారు. సోలో లైఫ్ ను లీడ్ చేయడానికే మన హీరోలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ముగ్గురు హీరోలు బ్యాచ్‌లర్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో మొదటి సినిమా భీష్మ. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. గతకొద్ది కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో నితిన్ సింగిల్ లైఫ్ తో చిరాకు పడుతున్నట్లు ఇటీవలే విడుదల చేసిన సింగిల్స్ యాంథమ్ ను రిలీజ్ చేసినప్పుడే అర్థమైంది. సినిమాలో లవర్ కోసం నితిన్ చాలా పాట్లే పడతాడట. మరి ఆ హడావుడి చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతుంది. `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ‌నున్నారు. ఇక ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అమ్మాయి లవ్వు ఎలాంటి టెన్షన్స్ లేకుండా సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు. ఇక బ్యాచ్‌లర్ లైఫ్ కంటే బెస్ట్ లైఫ్ మరొకటి లేదని ఈ సినిమాలో సాయి తేజ్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ మధ్య బ్యాచిలర్ లైఫ్ వల్ల వుండే లాభాలేంటో కూడా ఒక లిస్ట్ ను తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

[custom_ad]

ఇక అఖిల్ కూడా తాను బ్యాచ్‌లర్ నే అంటున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా అఖిల్ బ్యాచ్‌లర్ జీవితంతో సతమతమవుతుంటాడు.

మరి ఏ బ్యాచిలర్ ఎంత హడావుడి చేస్తాడో చూడాలంటే మాత్రం సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 9 =