ఇద్దరు యంగ్ హీరోలకు తల్లిగా రమ్యకృష్ణ..!

Ramya Krishna,Ramya Krishna Upcoming Mother Roles 2020,Ramya Krishnan Mother Role Movies,Actress Ramya Krishna Movie News,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ramya Krishna Upcoming Movies 2020

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. ఆతర్వాత ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్రతో తనలోని మరో యాంగిల్ ను చూపించి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. ఇక ఇటీవల వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో శివగామిగా తార స్థాయి కి చేరుకుంది. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. దీనితో తెలుగు తో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ రీ ఎంట్రీ లో కూడా తన దూకుడిని కొనసాగిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ఇప్పుడు తెలుగులో మరో ఇద్దరు యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తుంది. అందులో ఒక హీరో మెగా హీరో వరుణ్ తేజ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ కు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది.

[custom_ad]

మరో హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ కు కూడా తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ను ముంబై లోనే జరుపుతున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా ఎలాగైతే ఓ వెలుగు వెలిగిందో.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గ్రేట్. ఇమేజ్ మాత్రమే కాదు.. ఆమె కోసం పవర్ ఫుల్ పాత్రలు రాయడం గొప్ప విషయం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =