3 మిలియ‌న్ డాల‌ర్ల‌ క్ల‌బ్ లో `అల వైకుంఠ‌పుర‌ములో`

Ala Vaikunthapurramuloo Movie Joins 3 Million Dollar Club

2020 సంక్రాంతి సంచ‌ల‌నం `అల వైకుంఠ‌పుర‌ములో`… ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల `నాన్ – బాహుబ‌లి` రికార్డుల‌ను న‌మోదు చేసే దిశ‌గా అడుగులేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్… ఓవ‌ర్సీస్ లోనూ స‌త్తా చాటుతోంది. తాజాగా ఈ అల్లు అర్జున్ స్టారర్… యు.ఎస్. బాక్సాఫీస్ ముంగిట‌ 3 మిలియ‌న్ డాల‌ర్ల (గ్రాస్) క్ల‌బ్ లో చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క్ల‌బ్ లో ఐదు తెలుగు చిత్రాలు (`బాహుబ‌లి` చిత్రాలు, రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, సాహో) ఉండ‌గా… ఆరో సినిమాగా `అల వైకుంఠ‌పుర‌ములో` స్థానం ద‌క్కించుకుంది. కాగా,`రంగ‌స్థ‌లం` (3.513 మిలియ‌న్ డాల‌ర్లు) పేరిట ఉన్న `నాన్ – బాహుబ‌లి` రికార్డును `అల వైకుంఠ‌పుర‌ములో` లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్లతో వ‌శం చేసుకునే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… అటు బ‌న్నీకి, ఇటు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కి ఇదే తొలి `3 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్` మూవీ కావ‌డం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =