ఛాలెంజింగ్ పాత్రలో నవీన్ చంద్ర..!

Naveen Chandra To Play An Interesting Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Naveen Chandra Latest News,Naveen Chandra New Movie News,Naveen Chandra Next Film Updates,Naveen Chandra Latest Movie Details,Naveen Chandra Next Project News,Naveen Chandra Upcoming Film News

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. ఆ సినిమాలో నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కడమే కాదు.. ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడనుకున్నారు అందరూ. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవీ నవీన్ చంద్రకు పెద్దగా కలిసిరాలేదు. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చంద్ర.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాతో ఈ సారి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ బాల్ రెడ్డి అనే ఒక మంచి పాత్రను ఇవ్వడంతో నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అయ్యింది. అరవింద సమేత చిత్రం తర్వాత మళ్లీ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఇక పక్క హీరో గా చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఈ నేపథ్యంలోనే మరో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నాడు నవీన్ చంద్ర. తమిళంలో ధనుష్ హీరోగా ‘పట్టాస్’ సినిమాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించాడు నవీంచంద్ర. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమా ట్రైలర్ తాజాగా వచ్చింది. ఇక ఈ సినిమాలో దాదాపు 50 ఏళ్ళు వున్న వ్యక్తి పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తున్నాడు. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తుంటే.. గుబురు గ‌డ్డంతో ఉన్న న‌డి వ‌య‌సు పాత్ర‌లో న‌వీన్ త‌న టాలెంట్ బాగానే చూపించిన‌ట్లున్నాడు. అంతేకాదు త‌న పాత్ర‌కు అత‌ను డ‌బ్బింగ్ కూడా చెప్పుకోవ‌డం విశేషం. మరి ఈ సినిమా తర్వాత నవీన్ కు కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు క్యూ కడతాయేమో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 14 =