శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ బ‌న్నీ, సుక్కు చిత్రం?

Bunny - Sukumar New Movie Speeds Up Shooting Work

`ఆర్య‌`, `ఆర్య 2` త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని టాక్. ఇప్ప‌టికే బ‌న్నీ పాత్ర‌కు సంబంధించిన చిన్న‌ప్ప‌టి స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ని స‌మాచారం. అంతేకాదు… బ‌న్నీ లేకుండానే కేర‌ళ‌లోని ద‌ట్ట‌మైన అడ‌వుల మ‌ధ్య‌, ఓ జ‌ల‌పాతం నేప‌థ్యంలో క‌థానాయ‌కుడి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కూడా చిత్రీక‌రించాడ‌ట సుక్కు. కాక‌పోతే, బ‌న్నీపై బ్లూ మ్యాట్ లో షాట్ తీసి, దాన్ని సీజీ సాయంతో క‌వ‌ర్ చేస్తార‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం `అల వైకుంఠ‌పుర‌ములో` షూటింగ్, ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ తో బ‌న్నీ ఫుల్ బిజీగా ఉండ‌డం వ‌ల్లే… స‌మ‌యం వృధా కాకుండా, ఈ త‌ర‌హాలో షూటింగ్ ని డిజైన్ చేశాడ‌ట సుక్కు. జ‌న‌వ‌రి రెండో వారం నుంచి బ‌న్నీ కూడా షూటింగ్ లో పాల్గొంటాడ‌ని… గుబురు గ‌డ్డంతో పాటు కాస్త బ‌రువు కూడా పెరగాల్సి ఉండ‌డంతో కొంత స‌మ‌యం తీసుకుని మ‌రీ బ‌న్నీ షూట్ లో జాయిన్ అవుతాడ‌ని ఇన్ సైడ్ టాక్. మ‌రి… కొత్త త‌ర‌హాలో అల్లు అర్జున్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం… అభిమానుల‌ను ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో చూడాలి.

ర‌ష్మిక మంద‌న్న నాయిక‌గా న‌టిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కి దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =