ఛాలెంజింగ్ పాత్రలో అమల అక్కినేని..!

Amala Akkineni Takes Up Challenging Role,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Akkineni Amala Challenging Role,Amala Akkineni Next Interesting Role,Amala Akkineni Recent News

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ పలువురు బయోపిక్ లు రాగా..తాజాగా మరో క్రీడాకారుడు బయోపిక్ వస్తున్న సంగతి తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో అక్కినేని అమల కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. పుల్లెల గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ పాత్రలో అమల నటిస్తున్నట్టు సమాచారం. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లో ఛాంపియన్ గా ఎదగడానికి సుబ్బరావమ్మ గారి పాత్ర చాలా వుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు అమల అయితే సరిపోతుందని తనను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తల్లి కొడుకులు మధ్య వుండే ఎమోషన్ ను ఈ సినిమాలో బాగా చూపించనున్నట్టు తెలుస్తుంది.

మరి సుధీర్ బాబు సినిమా రంగంలోకి రాకముందు మంచి బ్యాట్మింటన్ ప్లేయర్ అని అందరికీ తెలిసిందే. స్కూల్లో నేషనల్ ప్లేయర్ గా ఎన్నో మెడల్స్ అందుకున్నాడు. అంతేకాదు… పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆయన అప్పట్లో డబుల్స్‌ విభాగంలో మ్యాచ్‌లు కూడా ఆడాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =