40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న నాగ‌చైత‌న్య `ల‌వ్ స్టోరీ`

Naga Chaitanya Love Story Completes 40 Percent Of Movie Shoot,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Naga Chaitanya Love Story,Naga Chaitanya New Movie Shooting Updates,Naga Chaitanya Latest News 2019

ఈ ఏడాది వేస‌విలో విడుద‌లైన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `మ‌జిలీ`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌. క‌ట్ చేస్తే… వ‌చ్చే సంవ‌త్స‌రం వేస‌విలో మ‌రో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. `ల‌వ్ స్టోరీ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రంలో చైతూకి జోడీగా డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి న‌టిస్తుండ‌గా… ఫీల్ గుడ్ మూవీస్ స్పెష‌లిస్ట్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్ప‌టివ‌ర‌కు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ఇంత‌వ‌ర‌కు సినిమాలో కీల‌క‌మైన ప‌లు స‌న్నివేశాల‌ను షూట్ చేసార‌ని స‌మాచారం. `ల‌వ్ స్టోరీ`లో చైతూ స‌రికొత్త లుక్ తో క‌నిపించ‌నున్నాడు. అలాగే ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌న‌నున్నాడు.

ఇదిలా ఉంటే… చైతూ తాజా చిత్రం `వెంకీమామ‌` ఈ రోజు జ‌నం ముందుకొచ్చింది. త‌న మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌ల‌సి న‌టించిన ఈ సినిమాకి స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + ten =