‘అర్జున్ రెడ్డి’ ఎఫెక్ట్ – ఫుల్ క్రేజ్ లో ‘ఆదిత్య వర్మ’

Aditya Varma Movie Gets Great Response,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Aditya Varma Movie Response,Aditya Varma Telugu Movie,Aditya Varma Movie Updates,Aditya Varma Response
Aditya Varma Movie Gets Great Response,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Aditya Varma Movie Response,Aditya Varma Telugu Movie,Aditya Varma Movie Updates,Aditya Varma Response

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను తమిళ్ కూడా రీమేక్ చేసిన సంగతి విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫైనల్ గా ‘అర్జునరెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ రిలీజ్ కు సిద్ధమైంది. మొదటినుండి ఈ సినిమాకు కాస్త ఇబ్బందులు ఎదురైనా.. విక్రమ్ మాత్రం పట్టుపట్టి ఈ సినిమాను ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రయిలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ బాగానే పడినట్టుంది. ఇక రేపు విడుదల కానున్న ఈ సినిమాకు స్పెషల్ షోస్ వేయనున్నారు. జి.కే సినిమాస్ లో ఈ ఉదయం 8 గంటలకు స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్య వర్మకు కూడా క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ టికెట్స్ హాట్ కేక్స్ గా అమ్ముడుపోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి బానిత సంధు నటిస్తోంది. అర్జున్ రెడ్డి లో జియా శర్మ పాత్రలో హీరోయిన్ ప్రియా ఆనంద్ నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నాడు.

మరి తెలుగు, హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఈ సినిమా తమిళ్ లో హిట్ కొడుతుందో..?లేదో..? మొదటి సినిమానే రీమేక్ చేస్తున్న ధృవ్ కి ఈ సినిమా కలిసొస్తుందో..?లేదో..? చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =