
ట్యాగ్ · 6 కథనాలు

`అర్జున్ సురవరం`కి అచ్చొచ్చిన సెంటిమెంట్స్
'అర్జున్ సురవరం' నిఖిల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్

'అర్జున్ సురవరం' ట్రైలర్ రిలీజ్
'అర్జున్ సురవరం' కు డేట్ దొరికేసిందంటున్న నిఖిల్..!

'అర్జున్ సురవరం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
విడుదలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఫైనల్ విడుదలై మొత్తానికి డీసెంట్ హిట్ టాకే తెచ్చుకుంది నిఖిల్ 'అర్జున్ సురవరం'. నవంబర్ 29 వ తేదీన రిలీజ్ ఐన ఈ సినిమా మొదటిరోజే మంచి టాకే తెచ్చుకొని... కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేదనిపించింది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని... నిఖిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా వన్ వీక్ లో మంచి కలెక్షన్సే రాబట్టిన్నట్టు తెలుస్తుంది.
`అర్జున్ సురవరం`కి అచ్చొచ్చిన సెంటిమెంట్స్
ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`... శుక్రవారం (నవంబర్ 29) జనం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ `కణితన్` ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా... పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు ఏడాదికిపైగా ఆలస్యంగా విడుదలకు నోచుకుంది. అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో... `అర్జున్ సురవరం`కి సర్వత్రా మంచి స్పందన వచ్చింది. కొన్ని ఏరియాల్లో థియేటర్ల సంఖ్యను పెంచడం చూస్తే... ఈ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుందన్న విషయం స్పష్టమవుతోంది.
'అర్జున్ సురవరం' నిఖిల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
మొత్తానికి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్న రేంజ్ లో ఫైనల్ థియేటర్స్ కు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాడు నిఖిల్ 'అర్జున్ సురవరం' తో. విడుదలకు ఎన్నో ఇబ్బందుల పై ఫైనల్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటిరోజే ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా పరవాలేదనిపించింది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు. ఇక వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం వుంది.
`అర్జున్ సురవరం`కి ఆ సెంటిమెంట్ ప్లస్ అవుతుందా?
`ఫేక్ సర్టిఫికేట్ స్కామ్` నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం `అర్జున్ సురవరం`. తమిళ బ్లాక్ బస్టర్ `కణితన్` ఆధారంగా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించగా... ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు టి. సంతోష్ తెరకెక్కించాడు. విడుదల విషయంలో పలు ఇబ్బందులు చూసిన ఈ యాక్షన్ థ్రిల్లర్... ఎట్టకేలకు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అర్జున్ సురవరం' ట్రైలర్ రిలీజ్
ఫైనల్లీ 'అర్జున్ సురవరం' సినిమాకు మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్నారు అంతా.. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అర్జున్ సురవరం' కు డేట్ దొరికేసిందంటున్న నిఖిల్..!
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెలుగులో నిఖిల్ హీరోగా అర్జున్ సురవరం పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని నెలల క్రితం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. కానీ అప్పటినుండి ఇప్పటివరకు రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.