వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ తమిళ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 39 వ మూవీ రూపొందనుంది. శౌర్యం, శంఖం, దరువు వంటి హిట్ మూవీస్ తో దర్శకుడు శివ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక హీరో సూర్య తన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో అలరించే సూర్య రక్త చరిత్ర తెలుగు మూవీ లో నటించారు. అజిత్ హీరోగా వరుసగా 4 మూవీస్ రూపొందించిన శివ హీరో సూర్య కాంబినేషన్ లో ఈ మూవీ చేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూర్య 39 మూవీ లో స్టార్ హీరోయిన్స్ నయనతార, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నట్టు సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు D.ఇమ్మాన్ ఫస్ట్ టైమ్ సూర్య మూవీ కి సంగీతం సమకూరుస్తున్నారు . సూర్య 39 మూవీ ని 2020 పొంగల్ కు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. హీరో సూర్య అభిమానులు సూర్య ను ఎలా చూడాలనుకొంటున్నారో అంతకుమించి పవర్ ఫుల్ రోల్ లో సూర్య ను దర్శకుడు శివ ప్రెజెంట్ చేయనున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: