మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఒందు కథ హెల్లా హిట్ మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయమయ్యారు. ది మాయన్ పేరుతో రూపొందుతున్న తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. గ్యాంగ్ లీడర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా శ్రీకారం చుట్టిన ప్రియాంక ఆ మూవీ రిలీజ్ కాకుండానే శ్రీకారం మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో హీరో నాని , ప్రియాంక జంటగా రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్, ప్రియాంక జంటగా శ్రీకారం మూవీ రూపొందనుంది. ఆగస్ట్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. శ్రీకారం మూవీ కి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు . శ్రీకారం మూవీ ని 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
[youtube_video videoid=qyh3u9ks–s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























