యూట్యూబ్‌లోనూ సంచ‌ల‌నం సృష్టిస్తున్న ‘ఎఫ్ 2’

2019 Latest Telugu Movie News, F2 Hindi Dubbed Movie Sensation In Youtube, F2 Movie Creates Sensation In Digital Platform, F2 Movie Latest Updates, F2 Movie Takes YouTube by Storm, F2 New Released Hindi Dubbed Full Movie Released, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
F2 Movie Takes YouTube by Storm
గ‌త కొంత‌కాలంగా యూట్యూబ్ వేదికగా హిందీలోకి అనువదింపబడుతున్న‌ పలు తెలుగు చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. వాటిలో సింహభాగం యాక్షన్ మూవీస్‌దే హ‌వా కాగా… ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్ సెన్సేష‌న్ సృష్టిస్తోంది. ఆ చిత్రమే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా, పంజాబీ భామ మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి పలు భారీ చిత్రాల నడుమ విడుదలై ఘన విజయం సాధించిన ఈ హిలేరియ‌స్‌ ఎంటర్‌టైనర్‌ను స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. కాగా… గత ఆదివారం అంటే జూలై 14న ఈ సినిమా హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేయ‌గా… కేవలం 5 రోజుల్లోనే `ఎఫ్ 2` హిందీ వెర్ష‌న్‌ 24 మిలియన్ వ్యూస్‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.84 కోట్ల షేర్‌ను రాబ‌ట్టిన‌ ఈ చిత్రం… ఇప్పుడు యూట్యూబ్ వేదిక‌గా ఇంకెన్ని సంచలనాలు సృష్టించనుందో చూడాలి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=bPHYrP8kHvw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =