కృష్ణవంశీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా ‘రుద్రాక్ష’?

#KrishnaVamsi, Director Krishna Vamsi Next Film Updates, Krishna Vamsi New Movie Details, Krishna Vamsi Next Project Details, Krishna Vamsi Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Krishna Vamsi New Movie Details

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణవంశీ… తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు. కుటుంబ కథా చిత్రాలతో పాటు అందమైన ప్రేమకథలనూ మనసుకు హత్తుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి… గత కొంత కాలంగా ఆశించిన విజయం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రుద్రాక్ష’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడట వంశీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… చాలా కాలం క్రితమే హీరోయిన్‌ ఓరియెంటెడ్ హారర్ సబ్జెక్ట్‌ను రూపొందించాలనే ఆలోచ‌న‌తో ‘రుద్రాక్ష’ అనే మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్‌ను రాసుకున్నాడ‌ట కృష్ణవంశీ. ఇప్పుడు ఆ సినిమానే స‌ద‌రు క్రియేటివ్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. గతంలో వంశీతో ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ ఈ హారర్ మూవీని కూడా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు గంట సేపు సాగే విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌ని స‌మాచారం. అలాగే, ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం ఓ అగ్ర కథానాయికను ఎంపిక చేసే ఆలోచనలో కృష్ణ‌వంశీ ఉన్నట్టు టాలీవుడ్ టాక్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మరింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

[subscribe]

[youtube_video videoid=bdEna7_pg-o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =