‘సైరా’, ‘ఉప్పెన‌’లో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల డిటైల్స్‌

Vijay Sethupathi Role Revealed In Uppena and Sye Raa Narasimha Reddy Movies,Telugu Filmnagar,Telugu Film Udates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Sethupathi Role in Sye Raa Movie,Sye Raa Telugu Movie Latest Updates,Interesting Character For Vijay Sethupathi in Sye Raa Movie,Vijay Sethupathi Role in Uppena Movie
Vijay Sethupathi Role Revealed In Uppena and Sye Raa Narasimha Reddy Movies

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తూ… తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న నటుడు విజయ్ సేతుపతి. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్ రెండు తెలుగు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… ఈ రెండు సినిమాలు కూడా మెగా కాంపౌండ్ చిత్రాలు కావ‌డం విశేషం. ఒక‌వైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తూనే… మ‌రోవైపు చిరు మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న `ఉప్పెన‌`లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు సేతుప‌తి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ఈ రెండు చిత్రాల్లో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల‌కు సంబంధించి క్లారిటీ వ‌చ్చింది. `సైరా`లో తమిళం మాట్లాడే ఓబయ్య పాత్రలో దర్శనమివ్వనున్నాడట‌ విజయ్. అంతేకాదు, క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర ఇద‌ని స‌మాచారం. ఇక ‘ఉప్పెన’ విష‌యానికి వ‌స్తే… ఇందులో క‌థానాయిక (కృతి శెట్టి) తండ్రిగా కనిపించనున్నాడ‌ట ఈ త‌మిళ న‌టుడు. సినిమాకి ఈ పాత్రే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని తెలిసింది. మ‌రి… ఏడాది చివ‌ర‌లో రానున్న ఈ రెండు మెగా కాంపౌండ్‌ చిత్రాల‌లో విజ‌య్ ఏ మేర‌కు అల‌రిస్తాడో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=_KipLav1W54]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =