2002లో విజయబాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సొనాలీ బింద్రే, అన్షు హీరో హీరోయిన్లుగా వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మథుడు సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జునకు కూడా మన్మథుడు అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమాకు రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈనెల 13వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక పోస్టర్ విషయానికొస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ప్లేయింగ్ కార్డ్స్ లో నాగార్జున రెండు చిత్రాలలో ఒకదాంట్లో కాఫీ మగ్, మరో దాంట్లో వైన్ పెగ్ పట్టుకొని ఆసక్తి రేపుతోంది. దీన్ని బట్టి ఈ సినిమాలో నాగార్జున రెండు షేడ్స్ లో నటిస్తాడన్న విషయం అర్దమవుతోంది.
కాగా ఈ సినిమాలో నాగార్జునకు తోడుగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున, పి.కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
[youtube_video videoid=j7B34XDQ3Bo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: